భారత ఐటీ రంగంలో ఆ మూడింటిదే అగ్రస్థానం

భారతదేశం సమాచార సాంకేతిక విప్లవంలో అగ్రరాజ్యాలతో పోటీ పడుతోంది. చాలా దేశాలకు ఇక్కడి సంస్థలు ఔట్ సోర్సింగ్‌ను అందిస్తున్నాయి. దేశంలోని ఐటీ సంస్థలు పోటీ పడి పని చేస్తున్నాయి. వాటిలో టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రోలు తమ అమ్మకాలను విస్తరించాయి. భారతీయ మార్కెట్లో ఈ మూడు సంస్థలే మెగా వెండర్లుగా నిలిచాయి.

వీరు చాలా ప్రణాళికాత్మకంగా తమ సేవలను అందిస్తున్నారు. రెవెన్యూ ఆధారంగా టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రోలు వరుసగా మొదటి మూడు స్థానాలలో ఉన్నాయి. ఐబీఎం గ్లోబల్ సర్వీసెస్, ఈడీఎస్‌లు వీటి తరువాత స్థానంలో ఉన్నాయి. ఇవి రాబోయే మూడేళ్లలో మొదటి వరుసలోకి చేరుకోవచ్చునని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇప్పుడు ఉన్న మెగా వెండర్లతో పోల్చుకుంటే ఐబీఎం, ఈడీఎస్‌లు పెద్ద తేడాతో ఉన్నాయి. రాబోవు కాలంలో తమ అమ్మకాలను మరింతగా పెంచుకుని దేశీయంగానూ, అంతర్జాతీయంగానూ ఎదిగే పరిస్థితి ఉంది.

వెబ్దునియా పై చదవండి