ముంబయి లేమాన్ కోసం నోమురా

శనివారం, 4 అక్టోబరు 2008 (12:29 IST)
లేమాన్ బ్రదర్స్‌కు సంబంధించిన బ్యాక్ ఆఫీస్ ఆపరేషన్‌ను దక్కించుకోవడానికి నోమురా హోల్డింగ్స్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. చర్చలు చివరి దశకు వచ్చినట్లు నోమురా హోల్డింగ్స్ ప్రతినిధి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం రెండు సంస్థల ప్రతినిధుల మధ్య చర్చలు జరిగాయి.

అయితే ఎటువంటి ఒప్పందాలు జరగలేదు. న్యూయార్కులోని కార్యాలయంలో బుధవారం ఫైనల్ బిడ్స్‌ను వేశారు. లేమాన్ బ్రదర్స్ ఆర్థిక సంస్థ దివాలా తీసిన విషయం తెలిసింది. అయితే ఇందుకు సంబంధించిన ఉద్యోగులు మాత్రం ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.

లేమాన్ దివాలా తీయడం ప్రపంచంలోని వివిధ రంగాలపై ప్రభావం చూపింది. ఇలాంటి సమయంలో బ్యాక్ ఆఫీస్‌ ఆపరేషన్స్ కోసం నోమురా హోల్డింగ్స్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కాగా ఇప్పటికే చాలా మంది ఉద్యోగులు వివిధ సంస్థల్లోని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటున్నారు. నోమురా హోల్డింగ్స్ ఒప్పందం కుదిరితే ఉద్యోగులకు మేలు జరిగినట్లే.

వెబ్దునియా పై చదవండి