ఔట్ సోర్సింగ్‌లో మొదటి స్థానంలో ఇండియా

సోమవారం, 6 అక్టోబరు 2008 (18:45 IST)
ఔట్ సోర్సింగ్‌లో భారతదేశం తన ఆధిక్యతను కొనసాగిస్తోంది. పక్కనే ఉన్న చైనా భారత్‌కు గట్టి పోటీ ఇస్తోంది. అయినా 2008లో భారత్‌ మొదటి స్థానంలో పరుగులు పెడుతోంది. న్యూయార్క్‌లో జరిగిన కొత్త పరిశోధన మేరకు ఈ విషయం వెల్లడయ్యింది.

ప్రపంచంలోని ఔట్‌సోర్సింగ్ ‌జరుగుతున్న ఎనిమిది ప్రముఖ నగరాలలో ఆరు నగరాలు భారతదేశానికి చెందినవి కావడం విశేషం. వాటిలో బెంగుళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, ముంబయి, పూణేలు ఉన్నాయి. వీటిలో ఔట్‌సోర్సింగ్ ప్రాజెక్టులు అధికంగా ఉన్నాయి.

మిగిలిన రెండు నగరాల్లో ఒకటి ఐర్లాండ్‌కు చెందిన డబ్లిన్, పిలిప్పైన్స్‌కు చెందిన మటకిలున్నాయి. కాని చైనాలోని షాంగై, బీజింగ్ నగరాలు ఔట్‌సోర్సింగ్‌లో పోటీ పడుతున్నాయి. తాజా లెక్కల ప్రకారం భారతదేశం 2008 సంవత్సరానికి ముందంజలో ఉంది.

వెబ్దునియా పై చదవండి