డిజిటల్ కమ్యునికేషన్లో భారతీయులే ఫస్ట్

మంగళవారం, 16 సెప్టెంబరు 2008 (17:00 IST)
సెల్ ఫోన్లు, టీవీలు, ఇంటర్నెట్ ఆధారిత పరికరాలు వాడకంలో భారతీయులే మొదటి స్థానం ఆక్రమించుకున్నారు. బ్రిటన్ లెక్కల ప్రకారం డిజిటల్ కమ్యునికేషన్ పరికరాల కొనుగోళ్ళలో మనవారు అందరికంటే ముందున్నారు. 45 ఏళ్ళ లోపు ఉన్న భారతీయలలో దాదాపుగా ప్రతీ ఒక్కరు సెల్, టీవీ, ఇంటర్నెట్ సౌకర్యాలను కలిగి ఉన్నారు.

ఆఫ్‌కామ్ మీడియా నిర్వహించిన సర్వేలో ఈ అంశాలు వెలుగు చూశాయి. ఇండియన్లు మొదటి స్థానంలో ఉండగా, బ్లాక్ కారిబ్బీన్స్, బ్లాక్ ఆఫ్రికన్స్, పాకిస్తానీలు వరుసగా ఆ తరువాతీ స్థానాల్లో ఉన్నారు. ఇండియా, పాకిస్తాన్, బ్లాక్ ఆఫ్రికన్లలో ఎక్కవ మంది టీవీ, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్‌ను కలిగి ఉన్నట్లు తేల్చేశారు. లండన్‌లోని సాధారణ ప్రజల కంటే ఇండియన్లే అధికంగా డిజిటల్ పరికరాలను వాడుతున్నారు.

బ్రిటన్లో నివాసముంటున్న ఇండియా, పాకిస్తాన్‌ పౌరులు వారానికి సగటున 13.5 గంటలు ఇంటర్నెట్‍‌లో గడుపుతున్నారని తేల్చారు. బ్రిటన్‌కు చెందిన వారు 12.1 గంటలు వాడుతున్నారు. 60 నుంచి 73 శాతం మంది టీవీలు, గేమ్స్, రేడియో వాడకంలో మునిగి తేలుతున్నారని చెప్పారు. సాధారణంగా బ్రిటన్లు 55 శాతం వరకూ మాత్రమే వినియోగిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి