దారి మళ్ళుతున్న బ్యాక్ ఆఫీస్ సిబ్బంది

సోమవారం, 22 సెప్టెంబరు 2008 (17:22 IST)
ప్రపంచ వ్యాప్తంగా వివిధ ఆర్థిక సంస్థల్లో ఉన్నత స్థానాల్లో పని చేస్తున్న ఉద్యోగులు తమ దారి మార్చుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది తన బయోడేటాలను వివిధ సంస్థలకు పంపారు. లేమాన్ బ్రదర్స్ సంస్థ బలహీన పడడంతో చాలా మందిలో ఆందోళన పట్టుకుంది.

విదేశాలకు చెందిన ఆర్థిక సంస్థలు మార్కెటింగ్ దెబ్బతింటున్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితి ఉన్నత స్థాయి ఉద్యోగవర్గాల్లో అభద్రత కలుగజేసింది. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది తమ దారి మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముంబయిలో లేమాన్‌కు సంబంధించి 2 వేల మంది ఉద్యోగుల్లో చాలా మంది రోడ్డుపై నిలబడ్డారు.

వారం రోజులుగా చేసే పనిలేని ఖాళీగా ఉన్నామని ముంబాయిలోని లేమాన్ ఉద్యోగులు తెలిపారు. అలాగే వారికి రావాల్సిన బకాయిల గురించి ఇప్పటికే వారు దిగులు పడుతున్నారు.

వెబ్దునియా పై చదవండి