ఇంటర్నెట్ యుగంలో ప్రాణం పోసుకుంటున్న అత్యవసర బ్రాడ్‌కాస్ట్ వ్యవస్థ భీకర తుపానులు దాడి చేసే సమయంలో అసంఖ్యాక ప్రజలకు తక్షణ సమాచారం అందించేలా రూపొందుతోంది. దీంట్లో భాగంగా ఆన్‌లైన్ సోషన్ నెట్‌వర్క్‌ల ద్వారా తుఫాన్లకు సంబంధించిన వార్తలను ప్రజలకు తెలియపర్చేందుకోసం సుప్రసిద్ధ ఐటి సంస్థ మైస్పేస్, ఆమెరికా దేశీయ భద్రతా విభాగంతో జత కట్టింది.
ఈ వారం మొదట్లో అమెరికా గల్ఫ్ తీరంపై గుస్తావ్ తుఫాన్ విరుచుకుపడిన నేపథ్యంలో విపత్తు హెచ్చరిక వ్యవస్థను నిర్మించేందుకోసం ఒక ఫాస్ట్ ట్రాక్ ప్రాజెక్ట్‌ను రూపొందించవలసిందిగా అమెరికా దేశీయ భద్రతా విభాగం -డిహెచ్ఎస్- అధికారులు మైస్పేస్ అధికారులను కోరారు. ఇంటర్నెట్ సోషన్ నెట్‌వర్కింగ్ ద్వారా ప్రజలకు ఈ ప్రాజెక్టు విపత్తుల గురించిన సమాచారాన్ని అందిస్తుంది.
దీంట్లో భాగంగా అమెరికా ప్రభుత్వ విపత్తు నివారణ సంస్థల నుంచి మైస్పేస్ యూజర్లకు తుఫాన్ సమాచారాన్ని ఆటోమేటిక్‌గా ఫీడ్ చేసే ఒక సాఫ్ట్‌వేర్ అప్లికేషన్‌ను గత మంగళ వారం ప్రారంభించారు. డిహెచ్ఎస్ మరియు ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ సహకారంతో మీరు ఇప్పుడు చూస్తున్నవి భవిష్యత్తులో మరింత విస్తరించే అవకాశముందని మైస్పేస్ ప్రధాన భద్రతాధికారి హేమాన్షు నిగమ్ చెప్పారు. మహావిషాదాలు ప్రజలను మంచి పనులు చేసేలా పురికొల్పుతుంటాయని ప్రస్తుతం గుస్తావ్ తుఫాన్ ద్వారా జరిగింది ఇదేనని పేర్కొన్నారు.
ఈ ప్రాజెక్ట్ ఫలితంగా మైస్పేస్ యూజర్లు ఒక చిన్న అప్లికేషన్ లేదా విడ్జెట్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే అది గుస్తావ్ తుఫాన్‌చే నిరాశ్రయులైన వారికి సంబంధించిన సమాచారంతో కూడిన ఫెడరల్ సమాచార శాఖ ప్రొఫైల్ పేజీలకు లింక్ కలుపుతుందని నిగమ్ చెప్పారు. అలాగే తుఫాను బాధిత ప్రాంతాలలో సహాయ కార్యక్రమాలకు తోడ్పడటం, రాబోయే తుఫానుల జాడను ఆన్‌లైన్‌లో పసిగట్టడం వంటి పనులు చేయడానికి కూడా ఈ అప్లికేషన్ ఉపకరిస్తుందని పేర్కొన్నారు.
ప్రజలు చిత్రాలను, వీడియోలను, కథలను మరియు ప్రియతములకు తక్షణం పంపే వార్తలను పంచుకునే సోషల్ నెట్‌వర్కింగ్ పేజీలతో ఈ అప్లికేషన్ సహజంగా సంబంధం పెట్టుకుంటుందని మై స్పేస్ తెలుపుతుంది. తుపాన్‌లో చిక్కుకున్న మా పరిస్థితిని మా కుటుంబ సభ్యులకు, స్నేహితులకు చెప్పడానికి మైస్పేస్ ఎంతగానో ఉపయోగపడిందని బెక్కా అనే మహిళ మంగళవారం మైస్పేస్ అధ్యక్షుడు టామ్ ఆండర్సన్ ప్రొఫైల్ పేజికి పంపిన పోస్ట్‌లో తెలిపింది.
ఆండర్సన్ స్థాపించిన మైస్పేస్‌కు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెబుతున్నానని మైస్పేస్ భద్రతాధికారి నిగమ్ చెప్పారు. సంక్షోభ సమయాల్లో సోషల్ మీడియా శక్తిని ఎలా ఉపయోగించుకోవచ్చో అర్థం చేసుకోవడానికి కొన్ని వారాల క్రితం అమెరికా ప్రభుత్వ విపత్తు నివారణ సంస్థ మైస్పేస్‌ను కలిసిందని నిగమ్ తెలిపారు.
18 నెలల క్రితం మైస్పేస్ అంబర్ అలర్ట్స్‌ను తన యూజర్లకు అందించింది. అప్పటినుంచి ఇంతవరకు 45 కోట్ల మంది ప్రపంచ వ్యాప్తంగా తప్పిపోయిన లేదా అపహరణకు గురైన పిల్లల గురించి సమాచారాన్ని ఆన్‌లైన్‌లో పంచుకున్నారు. డిజిటల్ ప్రపంచంలోనూ ఎమర్జెన్సీ హెచ్చరిక వ్యవస్థను రూపొందించవచ్చని వెబ్ 2.0 మీడియా ఈ ఉదంతంతో నిరూపించిందని నిగమ్ చెప్పారు. మహా సంక్షోభాల కాలంలో ఇది ప్రజలమధ్య కనెక్ట్ చేస్తూ సమాచారాన్ని పంచిపెడుతోందని కొనియాడారు.
విపత్తు హెచ్చరికలు లేదా సందేశాలు మొబైల్ టెలిఫోన్లకు, ఇంటర్నెట్ కలిగిన కంప్యూటర్లకు చేరతాయని పేర్కొన్న నిగమ్ ఇదంతా మై స్పేస్‌ను పొగడటానికి చెప్పడం లేదని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పౌరులకు మనం సాయపడగలమని ఆధునిక టెక్నాలజీ మనకు బోధిస్తోందని చెప్పారు. సోషన్ మీడియాను కలిగిన ఏ దేశంలోనైనా దీనిని మనం గమనించవచ్చని తెలిపారు.