వినియోగదారునికి సరసమైన ధరలకు కంప్యూటర్లను ఇచ్చేందుకు డెల్ ఇంక్ ప్రణాళికలు సిద్ధం చేసింది. అలాగే తమ కాంట్రాక్టర్లలో నమ్మకం కలిగించేందుకు సన్నాహాలు చేశారు. అయితే ఉత్తర అమెరికాలోని తమ పరిశ్రమల నుంచి తక్కువ ధరకు పీసీలు బయటకు తీసుకురావడం అంత సులువైన పనికాదు.
తన పరిశ్రమలలో చాలా వాటిని రానున్న 18 నెలలో విక్రయించేందుకు సిద్ధపడుతోంది. డెల్ బయ్యర్లలలో చాలా మంది మంచి తయారీదాలే. వీరిలో చాలా మంది ఆసియా ఆధారితంగా ఉన్నవారే. ఇక్కడ ఉత్పత్తికయ్యే ఖర్చు తక్కువగా ఉంటుంది.
దీనిపై విశ్లేషకులు లెక్కగడుతున్నారు. విశ్లేషకుడు షన్నన్ క్రాస్ మాట్లాడుతూ, వారు ఎంత పొందుతారో తెలియదన్నారు. అయితే తమకు చెందిన ఉత్పత్తి ఆస్తులను భాగస్వాములకు బదాలాయించవచ్చునని చెప్పారు.
తమ ప్రత్యర్థులైన హెవ్లెట్ ప్యాకర్డ్ కో లాగా తమ లాభాలను పెంచుకునేందుకు డెల్ ప్రయత్నిస్తోందని చెప్పారు. తనకున్న తయారీ పరిశ్రమలలో దాదాపు 58 శాతం అమెరికాలోనే ఉన్నాయని విశ్లేషకులు తెలిపారు. 20 చొప్పున ఐర్లాండ్, పోలెండ్లలో ఉన్నాయి.