వర్టెక్స్ గ్లోబల్ హబ్‌గా ఇండియా

బుధవారం, 24 సెప్టెంబరు 2008 (19:46 IST)
వర్టెక్స్ బీపీఓ సంస్థ తన ఇండియాను అంతర్జాతీయ కేంద్రంగా ఎన్నుకోనున్నది. ఇక్కడే ఉన్న దేశీయ బీపీఓ సంస్థలను తనలో విలీనం చేసుకోవడానికి సన్నాహాలు చేస్తోంది. సంస్థ వివిధ రకాలుగా అభివృద్ధి కావడానికి యాజమాన్యం ప్రయత్నిస్తోంది.

మానవ వనరులు, ఆర్థిక సేవల విభాగంలో వివిధ పాత్రలను పోషిస్తోంది. వీటన్నింటిని ఇది యునైటెడ్ కింగ్‌డమ్, ఉత్తర అమెరికా, భారత్‌ల నుంచి వ్యవహారాలను చూస్తుంది. దాదాపు 300 రకాల విధులకు ఉద్యోగులను బదిలీ చేస్తారు.

భారత దేశ ప్రమేయం లేకుండా తాము లీడింగ్ గ్లోబల్ బీపీఓగా ఎదగడానికి వీలు కాదని ఆ సంస్థ ప్రతినిధి తెలిపారు. రెండు మూడు బీపీఓలను విలీనం చేసుకోవడానికి వర్టెక్స్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటి 12 వందల మంది ఉద్యోగులను కలిగిన సంస్థ వారి సంఖ్యను 5 నుంచి 6 వేలకు పెంచనున్నది.

వెబ్దునియా పై చదవండి