ఒకవైపు వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అమరావతి రాజధాని ప్రాంతంలో భూ సేకరణ బాధిత గ్రామాల్లో పర్యటనకు రంగం సిద్ధం చేసుకున్న తరుణంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఉన్నట్లుండి అమరావతి రైతుల సమస్యను ఎత్తిచూపుతూ రాజధాని ప్రాంతంలో ప్రత్యక్షమైపోయాడు. బుధవారం రాజధాని ప్రాంతంలోని ఉద్దండరాయని పాలెం, లింగాయ పాలెం గ్రామాలకు చెందిన రైతులు భారీ స్థాయిలో సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ‌్‌తో సమావేశమయ్యారు.
ప్రభుత్వం ముందుగా వాగ్దానం చేసినట్లుగా తమకు పునరావాస చర్యలు, సహాయాన్ని అందించలేదని, తమకు న్యాయం జరగలేదని రాజధాని ప్రాంత రైతులు ఆరోపించారు. తెలుగుదేశం ప్రభుత్వం తమపట్ల పక్షపాత దృష్టితో చూస్తోందని ప్రజలు పవన్‌కు చెప్పుకుని విలపించారు.