పిల్లల్లో ఎముకల బలానికి చేపలు తినిపించాల్సిందే.. మెదడుకూ మేలేనట

ఆదివారం, 20 నవంబరు 2016 (16:43 IST)
చేపల కాలేయంలో ఉండే విటమిన్ డి ఎముకల పెరుగుదలకు కీలకం. ఇది పిల్లల్లో ఎముకల పెరుగుదలకు సహకరిస్తుంది. చేపలను పిల్లలు తీసుకోవడం ద్వారా  హీమోగ్లోబిన్‌ స్థాయుల్ని పొందవచ్చు. ఇది చేపల్లో హిమోగ్లోబిన్ విరివిగా ఉండటమే ఇందుకు కారణం. 
 
అలాగే చేపల్లో అయోడిన్ పుష్కలంగా ఉంటుంది. వారానికి రెండుసార్లు చేపలు తీసుకుంటే పిల్లల్లో మెదడు ఎదుగుదలకు ఎంతో దోహదపడుతుంది. అలాగే చేపలు తీసుకుంటే రక్తంలో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్ డీహెచ్ఏ లెవల్స్ అత్యధిక స్థాయిలో ఉంటాయి. దీంతో మెదడులోని కణాలు సమర్థంగా పనిచేస్తాయి.
 
కాబట్టి వారంలో రెండు రోజులు చేపలు తినండి. ఇలా రోజూ చేపలు తీసుకునేవారిలో గుండెజబ్బులు, మధుమేహం, పక్షవాతం వంటి ముప్పు కారకాలు తక్కువని పరిశోధనలు తేల్చాయి. బొజ్జ, అధిక రక్తపోటు, రక్తంలో చక్కెర పెరగటం, మంచి కొలెస్ట్రాల్‌ తగ్గటానికి చేపలే దివ్యౌషధంగా పనిచేస్తాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి