పిల్లలకు ఈ ఐదు చాలు.. బయట ఫుడ్ వద్దు..

సోమవారం, 10 ఏప్రియల్ 2023 (18:40 IST)
పిల్లలకు చిన్నప్పటి నుంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినిపిస్తే వారి శరీరం, మెదడు ఆరోగ్యవంతంగా తయారవుతాయి. పిల్లల ఎదుగుదలకు ఈ 5 ఆహారాలు చాలా ముఖ్యమని న్యూట్రీషియన్లు అంటున్నారు. 
 
పాలలో పిల్లలకు అవసరమైన కాల్షియం, ప్రోటీన్లు ఉంటాయి. ఇది పిల్లల ఎముకలు, దంతాలను బలపరుస్తుంది. అలాగే అరటి పండులోని ఫైబర్, పొటాషియం మూత్రపిండాలు, గుండె రక్షణకు చాలా అవసరం.
 
ఇంకా కోడిగుడ్లలో ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. కోడిగుడ్లు పిల్లలకు అనేక పోషకాలను అందిస్తుంది. 
జీడిపప్పు, వేరుశెనగ, బాదం వంటి పప్పు దినుసులలోని పోషకాలు పిల్లలకు అవసరమైన కొవ్వును ఉత్పత్తి చేయడంలో సహాయపడతాయి.
 
ఇంకా ఎండు ద్రాక్షలో ఉండే ఐరన్, ఫైబర్ పిల్లలకు రోగనిరోధక శక్తిని, ఆరోగ్యాన్ని అందిస్తాయి. పిల్లలు టమోటాలు, బీన్స్, దోసకాయలతో సహా కూరగాయలు, పండ్లను తినడం అలవాటు చేసుకోవాలి. బయట చిరుతిళ్లు కొనడం కంటే పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారం ఇవ్వడం మంచిదని న్యూట్రీషియన్లు అంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు