టెక్నాలజీ పెరగడమో ఏమో కానీ... పిల్లలు టీవీలకు, వీడియో గేమ్‌లకు అతుక్కుపోతున్నారు. టీవీలకు అతుక్కుపోవడమే గాకుండా జంక్ ఫుడ్‌కు బాగా అలవాటుపడిపోతున్నారు. దీంతో చిన్న వయస్సులోనే పిల్లలు ఊబకాయం బరిలో పడుతున్నారు. ప్రపంచంలో బాలల్లో ఊబకాయుల సంఖ్య పెరుగుతుండటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది.
ప్రపంచంలో 2025వ సంవత్సరం నాటికి 5 నుంచి 17 ఏళ్లలోపు పిల్లల్లో 26.8 కోట్ల మంది అధికబరువు సమస్యతో సతమతమయ్యే అవకాశం ఉందని వాషింగ్టన్ పరిశోధకులు అంచనా వేశారు. పిల్లల జీవనశైలిలో మార్పులు చేసుకోకుంటే ఊబకాయుల సంఖ్య పెరిగే అవకాశముందని పరిశోధకులు హెచ్చరించారు. ఈ నెల 11వ తేదీన ప్రపంచ ఊబకాయ దినోత్సవం సందర్భంగా పిల్లల్లో పెరుగుతున్న అధిక బరువు సమస్యపై అంచనాలను విడుదల చేశారు.