పెద్దవాళ్ల అనుమతి తప్పనిసరి...?

మంగళవారం, 5 మార్చి 2019 (12:30 IST)
చాలామంది చిన్నారులకు పెద్దవాళ్లను ఏకవచనంతో సంబోధిస్తారు. పెద్దవాళ్ల అనుమతి లేకుండా వాళ్ల వస్తువులను తీసుకుంటుంటారు. ఇది మంచి పద్ధతి కాదంటున్నారు. కనుక చిన్న వయస్సులోనే వాళ్లలో మార్పు తేవాలి.. అందుకు ఏం చేయాలో చూద్దాం..
 
పిల్లలు మాటలు వచ్చిన కొత్తల్లో ఏం చెప్పినా బాగానే ఉంటుంది. మనకి నవ్వు వస్తుంది. ఇలా చేస్తుంటే వాళ్లు దాన్ని కొనసాగిస్తారు. అందువలన చిన్న వయసు అయినా.. పెద్దవాళ్లను ఎదిరిస్తుంటే ఖండించాలి. ఇలా చేయకూడదని చెప్పాలి.
 
చిన్నారులు పెద్దవాళ్లను నువ్వు అని సంబోధిస్తుంటారు. ఇలా చేయడం సరికాదని వాళ్లు మాట్లాడినప్పుడల్లా చెప్పాలి. అలానే ఏదయినా పనిచేసే ముందు పెద్దవాళ్ల అనుమతి తప్పనిసరిగా తీసుకోమని నేర్పించాలి. అప్పుడే.. వారి తప్పను సరిదిద్దుకుంటారు. పొరపాటు చేసినప్పుడు వెంటనే సారీ చెప్పడం కూడా చిన్నతనం నుండి అలవాటు చేయాలి.
 
అమ్మ అనుమతి లేకుండా.. తన బ్యాకు ముట్టుకోకూడదు అనేది పిల్లలకు అలవాటు కావాలి. లేదంటే.. పెన్సిలు కావాలన్నా, పుస్తకం కావాలన్నా అడక్కుండా తీసుకోవడం మొదలుపెడతారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు