చిన్న చిన్న విషయాలైనా సరే..?

మంగళవారం, 12 మార్చి 2019 (11:55 IST)
కొంతమంది చిన్నారులు తరచూ ఆత్మన్యూనతకు లోనవుతుంటారు. అలాంటివారిలో మార్పు తేవాలంటే.. అది తల్లిదండ్రులకు మాత్రమే సాధ్యం అవుతుంది. అందుకు ఈ జాగ్రత్తలు పాటించాల్సి వస్తుంది.
 
చిన్నారుల్లో క్రీడాస్ఫూర్తిని కలిగించాలి. వాళ్లకు నచ్చిన ఏదో ఒక ఆట.. క్రికెట్, ఫుట్‌బాల్ ఇలా ఒక్కొక్కటి చేర్పించాలి. ఆటలో భాగంగా వ్యాయామం కూడా చేయించాలి. ఇలా ప్రతిరోజూ నేర్పిస్తుంటే వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఆరోగ్యంగానూ ఉంటారు. 
 
పిల్లలు నిద్రించే సమయాల్లో వారికి కథల రూపంలో ఆత్మవిశ్వాసం ఎలా పెంచుకోవచ్చో వివరించాలి. వాళ్లు ఏ విషయంలో ఆత్మన్యూనతకు లోనవుతున్నారో తెలుసుకోవడం ఎంతైనా ముఖ్యం. దాన్నుండి ఎలా బయటపడాలో తల్లిదండ్రులే వారికి వివరించాలి. కుదిరితే మీరెలా బయటపడ్డారో వివరిస్తే పిల్లలు సులువుగా అర్థం చేసుకుంటారు. 
 
చిన్న చిన్న విషయాలైనా సరే.. వాళ్లంతట వాళ్లే నిర్ణయం తీసుకునేలా చూడాలి. కొన్నిసార్లు వాళ్లు నిర్ణయించుకోలేకపోవచ్చు. కానీ తల్లిదండ్రులు పక్కన ఉండి ఇలా చేస్తే బాగుంటుంది.. అలా చేయకూడదు.. నువ్వే ఆలోచించు అని సూచిస్తే.. వాళ్లే నిర్ణయించుకోగలుగుతారు. అప్పుడే వాళ్లపై వాళ్లకు నమ్మకం పెరుగుతుంది.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు