టీనేజ్ పిల్లలకు పనిష్‌మెంట్ ఇవ్వకూడదనే రూల్ లేదు!

శుక్రవారం, 19 డిశెంబరు 2014 (15:45 IST)
టీనేజ్ పిల్లలైనంత మాత్రాన పనిష్‌మెంట్ ఇవ్వకూడదనే రూలేం లేదంటున్నారు.. మానసిక నిపుణులు. అయితే ఆ పనిష్‌మెంట్ గురించి పిల్లలకు ముందే చెప్పాలి. వారంపాటు కారు లేదా బైక్ జోలికి వెళ్లకూడదు. లాంటి పనిష్‌మెంట్స్ బాగా వర్కవుట్ అవుతాయి. పాకెట్ మనీ కట్ చేయడం కూడా పనిష్‌మెంటే. ఒకవేళ ఇలాంటి పనిష్‌మెంట్ల మీద పిల్లలకు అభ్యంతరముంటే ఎలాంటి పనిష్‌మెంట్ ఇవ్వాలో వాళ్లనే అడిగి స్ట్రిక్ట్‌గా దాన్నే ఫాలో అవమని చెప్పండి. 
 
టీనేజర్లు ఎదిగే స్వేచ్ఛ ఇవ్వండి. అలాగని చెడు స్నేహాలతో పక్కదారి పడితే కచ్చితంగా దార్లోకి తెచ్చే ప్రయత్నం చేయాలి. కటువుగానైనా వాళ్లని కట్టడి చేయాలి. సద్వినియోగం చేసుకుని మంచి గుర్తింపు తెచ్చేందుకే స్వేచ్ఛ ఇస్తున్న సంగతిని టీనేజర్లు గ్రహించేలా పెద్దల ప్రవర్తన ఉండాలి. 
 
మద్యం, డ్రైవింగ్, డ్రగ్స్, ఆకర్షణలు, సెక్స్.. ఇవన్నీ టీనేజీ పిల్లలను ఆకర్షించే అంశాలు. వీటి పర్యవసానాలను పిల్లలకు అర్థమయ్యేలా చెప్పటం తల్లిదండ్రుల బాధ్యత. వీటి గురించి నిస్సందేహంగా చర్చించండి. అనుమానాలను నివృత్తి చేయండి. 

వెబ్దునియా పై చదవండి