నీళ్లతో ఆటలంటే పిల్లలకు చాలా ఇష్టం. కనుక వారికి ఈత నేర్పిస్తే.. శరీరం మొత్తానికి వ్యాయామం అందుతుంది. దాంతోపాటు చక్కటి శిక్షకుల దగ్గర శిక్షణ ఇప్పించాలి. ఇలా వ్యాయామాలు చేయడం వలన గుండెకు రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. అలానే ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది. వీటన్నింటికంటే చుట్టుపక్కల ఎక్కడైనా చిన్నారుల కోసం ప్రత్యేకించి వర్క్‌షాప్స్ జరుగుతుంటే తప్పక తీసుకెళ్లండి.
స్కూల్‌కి వెళ్లాలన్నా, షాపింగ్‌కి వెళ్లాలన్నా కూడా.. ఇప్పటివరకు మోటారు వాహనాలపై ప్రయాణం చేసేవారు. మీ చిన్నారికి పాత సైకిలైనా సరే ఈ వేసవిలో అందించాలి. వారు దాన్ని తొక్కేలా వూతం ఇవ్వాలి. రోజూ కనీసం 20 నిమిషాల పాటు సైకిల్ తొక్కితే చాలు.. వారి జీవక్రియా రేటు మెరుగుపడుతుంది. ఆందోళనా, ఒత్తిటి వంటివి కూడా అదుపులో ఉంటాయి. కంప్యూటర్‌లకు అతుక్కుపోయే ఆటలకు ఇక కట్టి పెట్టండి. వీలైతే వారిక్ బ్యాడ్మింటన్ రాకెట్ ఇవ్వండి.