చెన్నైకి దొరికిన కొత్త తమిళ కవి భజ్జీ.. చెప్పిందెవరు? (video)

శుక్రవారం, 12 ఏప్రియల్ 2019 (12:32 IST)
మైదానంలోనే మేము ఢీ అంటే ఢీ అంటాం..  మైదానం వీడితే మాత్రం అమాయకంగా నవ్వుకుంటాం.. అంటూ తమిళంలో హర్భజన్ సింగ్ చేసిన ట్వీట్ ప్రస్తుతం ట్విట్టర్‌ను షేక్ చేస్తోంది.


''కళత్తుల మట్టుమ్‌గాన్ నాంగ మొరైప్పోమ్... నన్బా.. కొంజెం వెలియిల వందు పారుంగ వెల్లందియా సిరిప్పోమ్'' అనే భజ్జీ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. రాజస్థాన్ జట్టుతో గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలుచుకున్న ధోనీ టీమ్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల పతనానికి రాజస్థాన్ జట్టు 151 పరుగులు సాధించింది. 
 
తదనంతరం బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు గట్టిలోనే గట్టి షాక్ తప్పలేదు. పరుగులేమీ చేయకుండానే తొలి ఓవర్లోనే వాట్సన్ అవుట్ కావడంతో చెన్నై షాక్ తింది. ఇక రెండో ఓవర్లో రైనా రనౌట్ కావడంతో సీఎస్‌కే ఫ్యాన్స్ డీలా పడిపోయారు. కానీ ధోనీ-రాయుడు అద్భుత ఇన్నింగ్స్‌తో సీఎస్‌కే జట్టు గెలుపు దిశగా అడుగులేసింది. ఉత్కంఠ రేపిన చివరి ఓవర్లో జడేజా తొలి బంతిలో సిక్సర్ కొట్టగా, ధోనీ మూడో బంతికి అవుట్ అయ్యాడు. ఐదో బంతి నోబాల్ కావడంతో అంపైర్‌తో ధోనీ వాగ్వివాదానికి దిగడం జరిగింది. 
 
కానీ చివరి బంతి సిక్సర్ కావడంతో చెన్నై గెలుపును నమోదు చేసుకుంది. ఫలితంగా పాయింట్ల పట్టికలో చెన్నై సూపర్ కింగ్స్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో జడేజా ఐపీఎల్‌ పోటీల్లో 100వ వికెట్‌ను సాధించాడు. అలాగే ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు వందో గెలుపును నమోదు చేసుకుంది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆటగాళ్లు ఎప్పటి లాగానే ట్విట్టర్‌ను షేక్ చేశారు. 
 
విజిల్ పోడుతో పంచ్ డైలాగులతో సోషల్ మీడియాను షేక్ చేశారు. ఇదే తరహాలో రాజస్థాన్‌పై చెన్నై గెలుపుపై భజ్జీ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ''మేము వచ్చింది జైపూర్‌కే కావొచ్చు. అయితే ఐపీఎల్ పోటీల్లో అక్కడ కూడా  మా దర్బారే'' అంటూ భజ్జీ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం భజ్జీ చేసిన ట్వీట్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. చెన్నైకి కొత్త తమిళ కవి హర్భజన్ సింగ్ దొరికాడోచ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు