మాకే కదా కష్టం..!!

మంగళవారం, 17 మార్చి 2009 (13:26 IST)
"మీలో యుద్ధాలంటే ఎవరెవరికి ఇష్టమో చేతులెత్తండి పిల్లలూ..." క్లాసులో పిల్లలను ఉద్దేశించి అడిగాడు హిస్టరీ మాస్టారు

ఒక్కరు కూడా చేతులెత్తకపోవడంతో నివ్వెరపోయిన మాస్టారు "ఎందుకండర్రా యుద్ధమంటే ఎందుకంత అయిష్టం..?" అని అడిగాడు

"మరేం లేదు మాస్టారు... ఆ యుద్ధాలు జరిగిన దగ్గర్నించీ, చరిత్రలో వాటిని చదవలేక మేమే కదండీ చావాలి...!!" దిగులుగా చెప్పారు పిల్లలు.

వెబ్దునియా పై చదవండి