తాత్పర్యం : మూఢాత్ముడు గుణవంతుడి వెంట తిరుగుతున్నప్పటికీ అతడి సద్గుణాలతో కూడిన నడవడికలు గుర్తించలేడు. అయితే దీనిని జ్ఞాని అయిన వ్యక్తి గుర్తించగలడు. ఎలాగంటే.. కూరలో తిరుగుచుండిన గరిటె ఆ కూర రుచిని గుర్తించలేదు. అదే కూర రుచిని నాలుక సులభంగా గుర్తిస్తుంది కదా..! అదే విధంగా సుజ్ఞాని అయినవ్యక్తి, సద్గుణాలతో కూడిన నడవడికలను చాలా సులభంగా గుర్తిస్తాడని ఈ పద్యం యొక్క భావం.