కూరిమి గల దినములలో..!

FILE
కూరిమి గల దినములలో
నేరములెన్నడును గలుగ నేరవు మఱి యా
కూరిమి విరసంబైనను
నేరములే తోచుచుండు నిక్కము సుమతీ..!

తాత్పర్యం :
మనుషులు స్నేహముగా ఉన్నప్పుడు ఎదుటివారిలో అన్నీ ఒప్పులే కనిపిస్తాయి. ఒకవేళ వారు తప్పులు చేసినా కూడా మంచిగానే అనిపిస్తాయి. అదే వ్యక్తులు శత్రువులుగా మారినప్పుడు వారు చేసే మంచి పనులు కూడా చెడ్డవిగానే కనిపిస్తాయని ఈ పద్యం యొక్క భావం.

వెబ్దునియా పై చదవండి