ధీరులకు జేయు మేలది

శనివారం, 11 అక్టోబరు 2008 (13:31 IST)
FileFILE
ధీరులకు జేయు మేలది
సారంబగు నారికేళ సలిలము భంగిన్
గౌరవమును మఱి మీదట
భూరిసుఖావహము నగును భువిలో సుమతీ..!

తాత్పర్యం :
కొబ్బరిచెట్టుకు నీరుపోసినట్లయితే... శ్రేష్టమైన నీరుకలిగిన కాయలను ఇస్తుంది. అట్లే బుద్ధిమంతులకు చేసిన ఉపకారము మర్యాదను, తరువాత మిక్కిలి సుఖాలను కల్గిస్తుందని ఈ పద్యం యొక్క భావం.

వెబ్దునియా పై చదవండి