పరహితము లేని సంపద...!

FILE
పరహితము లేని సంపద
ధరనెవ్వడు గూర్చెనేని దక్కకపోవున్
మురిపెంబున జుంటీగలు
మరి కుడువక గూర్చు తేనె మార్గము సుమతీ..!

తాత్పర్యం :
తాను సంపాదించినదంతా తనకే దక్కాలనుకునే వారికి బాధే మిగులుతుంది. ఇతరులకు కావలసినదంతా నీ దగ్గరే ఉండిపోతే వారు దాన్ని నీ నుంచి కొల్లగొడతారు. తేనెటీగలు తమ కోసమని దాచుకున్న తేనె ఎప్పుడో ఒకప్పుడు ఇతరుల పాలైపోతుంది కదా...! అందుకే ఎంతయినా సంపాదించు, అయితే అందులో కొంత నువ్వు అనుభవించి, మరికొంత ఇతరులకు కూడా పంచాలి. అప్పుడే నువ్వు క్షేమంగా ఉంటావని ఈ పద్యం యొక్క భావం.

వెబ్దునియా పై చదవండి