పరహితమైన కార్య మతి భారము...!

FILE
పరహితమైన కార్య మతి భారముతోడిదియైన పూను స
త్పురుషుడులోకము ల్పొగడ, పూర్వమునం దొక రాలవర్షమున్
కురియగ చొచ్చినన్ తగిసి గొబ్బున గోజన రక్షణార్థమై
గిరి నొక కేల ఎత్తెనట కృష్ణుడు ఛత్రము భాతి భాస్కరా...!!

తాత్పర్యం :
ప్రజలకు మంచి చేసే పని.. అది ఎంత కష్టమైనది అయినప్పటికీ మంచివాడు దాన్ని చేసేందుకు పూనుకుంటాడు. పూర్వకాలంలో రాళ్ల వర్షం కురిసినప్పుడు పశువులను, వారి రక్షకులను రక్షించేందుకు శ్రీకృష్ణుడు కొండనే చేతితో ఎత్తుకుని గొడుగులాగా పట్టాడనని ఈ పద్యం యొక్క భావం. కాబట్టి.. ప్రజలకు మంచి చేసే ఎలాంటి పని అయినా చేసేందుకు వెనుకాడకూడదు.

వెబ్దునియా పై చదవండి