పాల నీడిగింట గ్రోలుచునుండెనా మనుజులెల్ల గూడి మద్య మండ్రు, నిలువ దగని చోట నిలువ నిందలు వచ్చు విశ్వదాభిరామ వినుర వేమా..!!
తాత్పర్యం : మనం ఎంత మంచివాళ్ల అయినప్పటికీ ఉండకూడనిచోట ఉండటంవల్ల ఎన్నోరకాల అపనిందలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కల్లుపాకలో దూరి పాలు తాగినా చూసేవారు కల్లు తాగుతున్నారనే అపోహ పడతారు. కాబట్టి చేసేది ఎంత మంచిపని అయినా వెళ్లకూడని చోటికి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లకూడదని ఈ పద్యంలో చెప్పాడు వేమన మహాకవి.