పూర్వ జన్మమందు పుణ్యంబు చేయని..!

FILE
పూర్వ జన్మమందు పుణ్యంబు చేయని
పాపి తా ధనంబు బడయలేడు
విత్తమరచి కోయ వెదకిన చందంబు
విశ్వదాభిరామ... వినుర వేమా..!!

తాత్పర్యం :
పూర్వజన్మలో ఒక్క పుణ్యకార్యం కూడా చేయకుండా, ఈ జన్మలో ధన ధాన్యాలతో తులతూగాలని, స్వర్గసుఖాలను అనుభవించాలని కోరుకున్నంత మాత్రాన అవి లభించవు. విత్తనమే నాటకుండా, పంటకు ఆశపడటం ఎంత అజ్ఞానమో, పుణ్యకార్యాలు ఆచరించకుండా సుఖభోగాలను, అష్టైశ్వర్యాలను కోరుకోవడం కూడా అంతే అజ్ఞానం.. అని ఈ పద్యంలో చెప్పాడు వేమన మహాకవి.

వెబ్దునియా పై చదవండి