రాతి ప్రతిమదెచ్చి రాజసంబున..!

FILE
రాతి ప్రతిమదెచ్చి రాజసంబున నుంచి
పూజసేయు నరుడు బుద్ధిమాలి
భావమందు పరము భావించ నేరడో
విశ్వదాభిరామ వినుర వేమ..!

తాత్పర్యం :
ఎక్కడో పడి ఉన్న రాయిని తీసుకొచ్చి దానిని విగ్రహంగా మలిచి, దానికి పొంగును, హంగునూ కల్పించి పూజించటం ఉందే, ఇది మానవుని తెలివిలేనితనమే. జ్ఞానేంద్రియమైన హృదయంలో ఈశ్వరుని దర్శించవచ్చు కదా..! అంటూ ఈ పద్యంలో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాడు వేమన మహాకవి.

వెబ్దునియా పై చదవండి