అంతా ఒక్కటే.. మనమంతా ఒక్కటే...!!

FILE
అంతా ఒక్కటే మనమంతా ఒక్కటే
ఆంధ్రులమైనా, తమిళులమైనా
ఉత్కళులైనా, కన్నడులైనా
మరాఠి అయినా, గుజరాత్ అయినా
పంజాబ్ అయినా, బంగ్లా అయినా "అంతా"

వందనమండీ వందనం (తెలుగు)
వణక్కమమ్మా వణక్కం (తమిళం)
నమస్కార్ నమస్కార్ (హిందీ)
ఇస్సలాం ఇస్సలాం (అస్సామీ)

భాషలు వేర్వేరు అయినాగానీ
భావాలన్నీ ఒకటేనోయ్.. వేర్వేరయినాగానీ
జాతులు, మతములు
నీతులు అన్నీ ఒకటేనోయ్
దేశాలన్నీ ఒకటే అయితే, ద్వేషాలేమీ ఉండవుగా
బాలప్రపంచం, భావిప్రపంచం
భావిభారత వారసులం "అంతా"

వెబ్దునియా పై చదవండి