ఆదివారంనాడు అరటి మొలచింది

FILE
ఆదివారంనాడు అరటి మొలచింది
సోమవారంనాడు సుడి వేసి పెరిగింది

మంగళవారంనాడు మారాకు తొడిగింది
బుధవారంనాడు పొట్టి గెల వేసింది

గురువారంనాడు గుబురులో దాగింది
శుక్రవారంనాడు చకచకా గెల కోసి

అందరికీ పంచితిమి అరటి అత్తములు
అబ్బాయి, అమ్మాయి అరటిపండ్లివిగో...!!

వెబ్దునియా పై చదవండి