కొలని దోపరికి గొబ్బిళ్ళో..!

FILE
కొలని దోపరికి గొబ్బిళ్ళో
యదుకులస్వామికి గొబ్బిళ్లో
కొండ గొడుగుగా గోవుల గాచిన
కొండొక శిశువుకు గొబ్బిళ్ళో
దుండగంపు దైత్యుల కెల్లను తల
గొండు గండనికి గొబ్బిళ్ళో "కొల"

పాప విధుల శిశుపాలుని దిట్టుల
కోపగానికిని గొబ్బిళ్ళో
ఏపుని గంసుని నిడముల పెట్టిన
గోపబాలునికి గొబ్బిళ్ళో "కొల"

దండి వైరులను దరమి
దనుజుల గుండె గొబ్బిళ్ళో
వెండి పైడియిలు వెంకటగిరి పై
కొండలయ్యకును గొబ్బిళ్ళో "కొల"

వెబ్దునియా పై చదవండి