హలికునకున్ హలాగ్రమున నర్థము సేకురుభంగి దప్పిచే నలమటజెందువానికి సురాపగలో జల మబ్బినట్లు దు ర్మలిన మనోవికారియగు మర్త్యుని నన్నొడగూర్చి నీ పయిన్ దలవు ఘటింపజేసితిని దాశరథీ.. కరుణాపయోనిథీ..!!
తాత్పర్యం : రైతునకు నాగేటి చివర భాగమున హఠాత్తుగా ధనం లభించినట్లుగా, దప్పికతో బాధపడేవారికి గంగానదీ జలం దొరికినట్లుగా, చెడు బుద్ధిగల నన్ను మంచివాడిగా చేసి, నా బుద్ధిని నీపై తలపు కలిగించునట్లుగా చేసినచో ధన్యుడనయ్యెదను దయాంతరుడవగు భద్రాద్రి శ్రీరామా...! నీకు నమస్కారములు...!! అని ఈ పద్యం యొక్క భావం.