నిక్కమైన మంచినీల మొక్కటి చాలు..!

FILE
నిక్కమైన మంచినీల మొక్కటి చాలు
తళుకుబెళుకు రాళ్ళు తట్టెడేల?
చాటు పద్యములను చాలదా ఒక్కటి
విశ్వదాభిరామ.. వినుర వేమా...!!

తాత్పర్యం :
ఓ వేమా...! నిజమైన మంచి నీల మణి ఒక్కటే సరిపోతుంది. అంతేగానీ, ఊరికే మెరిసేటి గాజు రాళ్ళు తట్టెడు ఉన్నప్పటికీ వ్యర్థమే. అలాగే రసహీనమైన పద్యాలను ఎన్నింటిని విన్నా నిరుపయోగమేననీ, చాటు పద్యం ఒక్కటి వింటే చాలునని ఈ పద్యం యొక్క భావం.

వెబ్దునియా పై చదవండి