నేరనన్నవాడు నెరజాణ మహిలోన..!

FILE
నేరనన్నవాడు నెరజాణ మహిలోన
నేర్తునన్నవాడు వార్త కాడు
ఊరకున్నవాడె ఉత్తమోత్తముడెందు
విశ్వదాభిరామ వినుర వేమా..!!

తాత్పర్యం :
లోకంలో మూడు రకాల వ్యక్తులుంటారు. ఒకడు తనకు ఏపని చెప్పినా తెలియదని తప్పించుకుంటాడు. అతడు ఉపాయశాలి. రెండోవాడు ప్రతిదీ తనకే తెలుసని అంటాడు. ఇతడు మాటకారి. మూడవవాడు మౌనంగా పనులు చేసుకుంటూ వెళ్తాడు. ఇతడు ఉత్తమోత్తముడని ఈ పద్యంలో మెచ్చుకుంటున్నాడు వేమన మహాకవి.

వెబ్దునియా పై చదవండి