తాత్పర్యం : ప్రజలకు మంచి చేసే పని.. అది ఎంత కష్టమైనది అయినప్పటికీ మంచివాడు దాన్ని చేసేందుకు పూనుకుంటాడు. పూర్వకాలంలో రాళ్ల వర్షం కురిసినప్పుడు పశువులను, వారి రక్షకులను రక్షించేందుకు శ్రీకృష్ణుడు కొండనే చేతితో ఎత్తుకుని గొడుగులాగా పట్టాడనని ఈ పద్యం యొక్క భావం. కాబట్టి.. ప్రజలకు మంచి చేసే ఎలాంటి పని అయినా చేసేందుకు వెనుకాడకూడదు.