పాల నీడిగింట గ్రోలుచునుండెనా..!

FILE
పాల నీడిగింట గ్రోలుచునుండెనా
మనుజులెల్ల గూడి మద్య మండ్రు,
నిలువ దగని చోట నిలువ నిందలు వచ్చు
విశ్వదాభిరామ వినుర వేమా..!!

తాత్పర్యం :
మనం ఎంత మంచివాళ్ల అయినప్పటికీ ఉండకూడనిచోట ఉండటంవల్ల ఎన్నోరకాల అపనిందలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కల్లుపాకలో దూరి పాలు తాగినా చూసేవారు కల్లు తాగుతున్నారనే అపోహ పడతారు. కాబట్టి చేసేది ఎంత మంచిపని అయినా వెళ్లకూడని చోటికి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లకూడదని ఈ పద్యంలో చెప్పాడు వేమన మహాకవి.

వెబ్దునియా పై చదవండి