పుట్టు బిత్తలి వలె పోవు బిత్తలి వలె తిరుగు బిత్తలి వలె దేహె ధరణి ఉన్ననాటికైన ఉపకారి కాలేడు విశ్వదాభిరామ వినుర వేమ
తాత్పర్యం : మనిషికి పుట్టేటప్పుడు బట్టలు లేవు. చనిపోయినప్పుడు అంతే. బతికి ఉన్నప్పుడు తీస్తే పోయేవే కాబట్టి ఉన్నా, లేనట్లే లెక్క. బతికి ఉన్నప్పుడు వేషధారణ లెక్కకు రాదనీ, ఆ వ్యక్తి చేసిన మంచి, చెడులే మిగులుతాయని ఈ పద్యంలో చెప్పాడు వేమన మహాకవి. కాబట్టి నలుగురికీ మేలు చేయాలనే ఉద్దేశ్యం ఉంటేనే అతడు ఉపకారి అవుతాడు. లేకపోతే కాలేడని ఈ పద్యం యొక్క తాత్పర్యం.