మందులెందుకు దండగ.... విషకవి ఉన్నాడే..!!

FILE
ఒకసారి అళియ రామరాయలవారికి వాయురోగం వచ్చిందట. మందుల కోసం, వైద్యుడి కోసం అందరూ కంగారుపడుతూ తిరుగుతూ ఉంటే.. తెనాలి రామలింగ కవి మాత్రం నింపాదిగా కూర్చుని.. "దీనికి అంతగా కంగారు పడతారెందుకు..?" అంటూ రోగం నయమయ్యే చిట్కా క్రింది పద్యంలో చెప్పారట..!

"వోయమ్మలార..! మందులు
వేయేల మకారకొమ్ము విషకవిగానిన్
వాయెత్తకుండ జేసిన
వాయెత్తదు రామరాయ వసుధేశునకున్"

తాత్పర్యం :
మందులు ఎందుకు దండగ.. మకారకొమ్ము అనే విషకవి ఉన్నాడే మూర్తికవి (భట్టుమూర్తి).. అతడి వాగుడు కాస్తంత కట్టుపెడితే చాలు... రామరాయలవారి రోగం ఇట్టే నయం అయిపోతుంది కాబట్టి, అతడి నోరు మూయించటమే మందు అని తెనాలి రామలింగ కవి పై పద్యంలో చెప్పారు. రామలింగ కవికి, భట్టుమూర్తికీ వైరం ఉండేదని చెప్పే చాటు పద్యమే ఇది.

వెబ్దునియా పై చదవండి