మిరపగింజచూడ..!

శుక్రవారం, 26 సెప్టెంబరు 2008 (12:35 IST)
FileFILE
మిరపగింజచూడ మీద నల్లగనుండు
కొరికిచూడు లోనచురుకు మనును
సజ్జను లగునారి సారమిట్లుండురా
విశ్వదాభిరామ వినురవేమ...!

తాత్పర్యం :
మిరియపుగింజ మీద నల్లగా ఉన్నప్పటికీ... దానిని కొరికిన వెంటనే చురుక్కుమంటుంది. మంచి వారు పైకి ఏవిధంగా కనిపించినప్పటికీ వారిని జాగ్రత్తగా గమనించినచో అసలు విషయం బయటపడుతుందని ఈ పద్యం యొక్క భావం.

వెబ్దునియా పై చదవండి