వీడేనమ్మా కృష్ణమ్మా.. వేణువు ఊదే కృష్ణమ్మా..!!

FILE
వీడేనమ్మా కృష్ణమ్మ వేణువు ఊదే కృష్ణమ్మా
ఆవులకాసే కృష్ణమ్మ వీడే ముద్దుల కృష్ణమ్మా

కాళ్లగజ్జెలు చూడండి మొలలో గంటలు చూడండి
మెడలో దండలు చూడండి తలలో పింఛం చూడండి

చదువులనిచ్చే కృష్ణమ్మా సంపదలిచ్చే కృష్ణమ్మా
పాపలకాచే కృష్ణమ్మ బాలబంధుడీ కృష్ణమ్మా
వీడేనమ్మ కృష్ణమ్మ వేణువు ఊదే కృష్ణమ్మా...!!

వెబ్దునియా పై చదవండి