పూర్వము హరిశ్చంద్రుడను రాజు దైవ కృపలేక కాటి కాపరియై వీరబాహుని సేవింపవలసి వచ్చెను. కావున ఎంతగొప్ప వారికైనను భగవంతుని అనుగ్రహం లేనప్పును హీనుని కొలువవలసి వచ్చును. అటుల కొలుచుట తప్పుకాదు. రాజధాని యయోధ్య. కొడుకు లోహితాస్యుడు. భార్య చంద్రమతి. ఈ రాజు విశ్వామిత్రుడను ఋషికి గొంత ధనమిచ్చెని యొప్పుకుని తఱితో దానిందీర్చలేక కొంతకాలం కాశీపట్టణం నుండు వీరభాహు వను కాటికాపరి దాస్యముచేసి ఋణవిముక్తిని జేసికొనెను.