ఆ వృద్ధ జంట వద్ద ఆస్తుల్లేవు. ఒక్కే ఒక్క టీ కొట్టు మాత్రమే వుంది. ఆ టీ కొట్టును ఆధారంగా చేసుకుని విదేశాలు తిరిగొస్తారు. తిరిగొచ్చాక ఆ అప్పును తీర్చుకుంటారు. ఇది ఆ 70 ఏళ్ల వృద్ధ దంపతుల కథ. కేరళలోని కొచ్చి నగరంలో గిరినగర్‌లో శ్రీ బాలాజీ కాఫీ హౌస్‌ను విజయన్, ఆయన భార్య మోహన కలిసి నడుపుతున్నారు.
24 గంటల పాటు కష్టపడి టీ కొట్టును నిర్వహించే ఈ జంట.. విదేశాలకు ట్రిప్పేసే ముందు.. టీ కొట్టుని బ్యాంకుకు తనఖా పెట్టి అప్పు తీసుకుంటారు. తిరిగొచ్చాక కష్టపడి ఆ అప్పు కట్టేస్తారు. రెండు, మూడేళ్లు కష్టపడి అప్పు తీర్చాక మరో పర్యటనకు సిద్ధమవుతారు.