గుణవంతునకు తన స్నేహితుడైనవాడు ప్రేమతో...?

మంగళవారం, 22 జనవరి 2019 (11:20 IST)
అనఘునికైన జేకరు ననర్హుని చరించినంతలో
మన మెరియంగ నప్పు డవమానము కీడు ధరిత్రియందు నే
యనువుననైన దప్పవు యదార్థము తా నది యెట్టలన్నచో
నినుమునుగూర్చి యగ్ని నలయింపదె సమ్మెట పెట్టు భాస్కరా..
 
ఇనుముతో గూడిన అగ్నికి సుత్తిపోటు తప్పనట్లు, దుష్టునితో గూడ మఱి యే సంబంధము లేకపోయినను వానితో కూడినంత మాత్రముననే ఆ దుష్టునికి వచ్చు కీడు వానిని కూడినవానికీ వచ్చును.
 
అలఘుగుణప్రసిద్ధు డగునట్టిఘనుం డొకడిష్టుడై తనున్
వలచి యొకించుకేమిడిన వానికి మిక్కిలి మేలు చేయుగా
తెలిసి కుచేలు డొక్కకొణిదెం డటుకుల్ దనకిచ్చినన్ మహా 
ఫలదుడు కృష్ణు డత్యధిక భాగ్యము లాతనికీడె భాస్కరా..
 
గుణవంతునకు తన స్నేహితుడైనవాడు ప్రేమతో లేశమైన పదార్థము నిచ్చినను, అతనికి గొప్ప మేలుకలుగజేయును. దీనికీ గాథయే తార్కాణమని శతకకారుడు చెపుతున్నాడు..

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు