తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా పుష్కరాలు... చెన్నై తెలుగువారిని పిలవని ప్రభుత్వాలు...

శుక్రవారం, 12 ఆగస్టు 2016 (16:53 IST)
తెలుగువారు ఎక్కడ ఉన్నా తెలుగు రాష్ట్రాల్లో ఏదేని పండుగ జరుగుతున్నా, ఉత్సవాలు నిర్వహిస్తున్నా అక్కడ తమ హాజరు ఉంటుంది. తెలుగువారు పొరుగు రాష్ట్రాలైన కర్నాటక, తమిళనాడులోనూ ఎక్కువగానే ఉన్నారు. ఐతే ఏమిటంటే అనే కదా మీ సందేహం... మరేం లేదు... కృష్ణా పుష్కరాలకు చెన్నై నగరంలో ఉన్న తెలుగు ప్రముఖులకు ఆహ్వానాలు అందలేదట. 
 
రాష్ట్ర విద్యాశాఖమంత్రి గంటా శ్రీనివాసరావు పుష్కరాలకు రావలసిందిగా కోరుతూ రాజకీయ పార్టీలను ఆహ్వానించారట కానీ ఆంధ్రా సోషల్‌ అండ్‌ కల్చరల్‌ అసోసియేషన్ (ఆస్కా), ప్రపంచ తెలుగు సమాఖ్య, అఖిల భారత తెలుగు సమాఖ్య తదితర సంస్థలకు పిలుపు లేదట. కనీసం ఇ-మెయిల్ ద్వారా కూడా ఆహ్వానం పంపలేదట. దీనిపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. కాగా తమిళనాడులో ఏ తెలుగు కార్యక్రమం జరిగినా తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వాధినేతలను వీరు ఆహ్వానిస్తుంటారు. మరి అలాంటి తెలుగు సంస్థలకు కనీసం ఆహ్వానాలు అందకపోవడంపై చర్చనీయాంశంగా మారింది.

వెబ్దునియా పై చదవండి