[$--lok#2019#state#andhra_pradesh--$]
ప్రధాన ప్రత్యర్థులు: మాగంటి రూప (తెదేపా) వర్సెస్ మంగన భరత్ (వైసీపి)
ఆంధ్రప్రదేశ్లోని 25 లోక్సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. గత 2014 ఎన్నికల్లో ఈ స్థానం నుంచి మాగంటి మురళీమోహన్ విజయం సాధించారు. ఈసారి 2019లో వైసీపి నుంచి మంగన భరత్ బరిలోకి దిగారు. మరోవైపు మాగంటి మురళీమోహన్ కోడలు మాగంటి రూప ఈసారి టీడీపీ తరపున పోటీకి దిగారు. ఈ స్థానంలో జనసేన తరపున ఆకుల సత్యనారాయణ పోటీకి దిగారు.
[$--lok#2019#constituency#andhra_pradesh--$]
గత ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి మాగంటి మురళీమోహన్కి 630,573 ఓట్లు వచ్చాయి. వైసీపికి చెందిన బొడ్డు వెంకటరమణ చౌదరికి 463,139 ఓట్లు పోలయ్యాయి.
ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25 లోక్సభ స్థానాలు వున్న సంగతి తెలిసిందే. ఈసారి హేమాహేమీలు పోటీ పడుతున్నారు. తెదేపా నుంచి అశోక్ గజపతిరాజు, కేశినేని నాని, గల్లా జయదేవ్, రాయపాటి సాంబశివరావు, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, సి. ఆదినారాయణ రెడ్డి, పనబాక లక్ష్మి, శివప్రసాద్ తదితరులు వున్నారు. ఇక వైసీపీ నుంచి పి. వరప్రసాద్(పీవీపి), మాగుంట శ్రీనివాస రెడ్డి తదితరులు వున్నారు. జనసేన పార్టీ నుంచి వివి లక్ష్మీనారాయణ(సీబీఐ మాజీ జెడి), నాగబాబు(పవన్ కల్యాణ్ సోదరుడు) తదితరులు వున్నారు.