[$--lok#2019#state#andhra_pradesh--$]
ప్రధాన ప్రత్యర్థులు: అశోక్ గజపతి రాజు (తెదేపా) వర్సెస్ బెల్లాని చంద్రశేఖర్ (వైసీపి)
ఆంధ్రప్రదేశ్‌లోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. గత 2014 ఎన్నికల్లోనూ ఈ స్థానం నుంచి తెదేపాకు చెందిన పూసపాటి అశోక్ గజపతి రాజు విజయం సాధించారు. ఈసారి వైసీపి నుంచి బెల్లాని చంద్రశేఖర్ బరిలోకి దిగారు. ఈ నియోజక వర్గం గెలుపు లోక్ సభ స్థానాన్ని నిర్ణయిస్తుంది. కావున సీనియర్ నాయకుడు అశోక్ గజపతి రాజుతో బెల్లాని చంద్రశేఖర్‌కు గట్టి పోటీ తప్పదని చెప్పవచ్చు.
[$--lok#2019#constituency#andhra_pradesh--$]
గత ఎన్నికల్లో తెదేపాకి చెందిన పూసపాటి అశోక్ గజపతి రాజుకు 5,36,549 ఓట్లు పోలవగా, వైకాపా అభ్యర్థి వి.ఎస్.సి.కె.కె.రంగారావుకి 4,29,638 ఓట్లు వచ్చాయి.
ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25 లోక్ సభ స్థానాలు వున్న సంగతి తెలిసిందే. ఈసారి హేమాహేమీలు పోటీ పడుతున్నారు. తెదేపా నుంచి అశోక్ గజపతిరాజు, కేశినేని నాని, గల్లా జయదేవ్, రాయపాటి సాంబశివరావు, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, సి. ఆదినారాయణ రెడ్డి, పనబాక లక్ష్మి, శివప్రసాద్ తదితరులు వున్నారు. ఇక వైసీపీ నుంచి పి. వరప్రసాద్(పీవీపి), మాగుంట శ్రీనివాస రెడ్డి తదితరులు వున్నారు. జనసేన పార్టీ నుంచి వివి లక్ష్మీనారాయణ(సీబీఐ మాజీ జెడి), నాగబాబు(పవన్ కల్యాణ్ సోదరుడు) తదితరులు వున్నారు.