అదే నా భయం..

బుధవారం, 2 జులై 2008 (19:14 IST)
జోరున వర్షం కురుస్తోంది అంతవరకు ఊహల్లో పులకించిపోతున్న ప్రేయసీ ప్రేమికులు ప్రపంచంలోకి వచ్చి పాడుబడిన భవంతిలోకి దూరారు. తడిసి ముద్దవటంతో వణుకుతున్నారు.
ఈ వాతావరణం, చీకటి, ఈ చలి, ఈ వర్షం ఈ ప్రాంతం ఇవన్నీ చూస్తుంటే నాకేదో భయంగా ఉంది సురేష్.. గజగజలాడుతూ అంది శాంత
భయందేనికి డార్లింగ్.. నీ పక్కన నేనుండగా.. ఓదార్పు స్వరంతో అన్నాడు సురేష్.
మరదే నా భయం... ఒక్కసారిగా ముడుచుకుపోతూ అంది శాంతి.

వెబ్దునియా పై చదవండి