మెగాస్టార్ చిరంజీవి ఇటీవల బిజెపి నాయకులతో సమావేశాలు జరిపిన నేపథ్యంలో ఆయన రాజ్యసభకు నామినేట్ అవుతారని వార్తలు వచ్చాయి. అయితే, చిరు ఆ ఊహాగానాలను ఖండించారు. రాజకీయాల్లో చురుకైన అడుగు వేయడానికి తాను ఇష్టపడటం లేదని వివరణ ఇచ్చారు.
మరోవైపు, కమల్ హాసన్ త్వరలో రాజ్యసభకు నామినేట్ అవుతారనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ప్రస్తుతం తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే పార్టీ కమల్‌ను రాజ్యసభకు నామినేట్ చేయాలని యోచిస్తోంది. రాజ్యసభ ఎన్నికల తదుపరి రౌండ్ జూలై 2025లో జరగనుంది.