చీమలు పట్టొద్దనీ...

బుధవారం, 18 జూన్ 2008 (17:28 IST)
నోరు ఎందుకో చేదుగా ఉందనిపించి పంచదార వేసుకున్నాడు సూర్యం.. చప్పరించిన వెంటనే ఒక్క అరుపు అరిచాడు.
'ఏమేవ్.. ఆ పంచదారేంటే అంత చేదుగా ఉంది.' అని అడిగాడు..
బుల్లెట్ లాగా సమాధానం ఇచ్చింది భార్య..
'ఆ ఏముంది.. పంచదారకు చీమలు పట్టకుండా ఉండాలని కొద్దిగా చీమల మందు కలిపాను అంతే. ఆ మాత్రానికే చేదంటే ఎలా..'

వెబ్దునియా పై చదవండి