ఇద్దరు ప్రేమికులు పార్కులో షికారు చేస్తున్నారు. నడుస్తూండగా ఒక కుక్కకు మరో కుక్క ముద్దు పెడుతోండటం గమనించాడు ప్రియుడు.. వెంటనే ఇలా అన్నాడు.. 'చూశావా ప్రియా ఆకుక్కలను.. నాక్కూడా అలాగే చేయాలనుంది మరి...' అన్నాడు. అందుకు ఆ ప్రియాతి ప్రియురాలు ఇలా అంది. 'నువ్వు అలా చేస్తానంటే నాకేమాత్రం అభ్యంతరం లేదు. కాకపోతే అవి కరిస్తే మాత్రం నా పూచీ కాదు బాబూ..'