మీ బాయ్ ఫ్రెండ్‌ గురించి తెలుసుకోవాలంటే ఏం చేయాలి?

గురువారం, 16 జనవరి 2014 (16:48 IST)
FILE
ఒక వ్యక్తి గురించి తెలుసుకోవడానికి సహనం ఒక ప్రధానమైనటువంటి ఆయుధం. ఎందుకంటే అతని గురించి మరంత బెటర్‌గా తెలుసుకోవడాని సహనం ఓపిక అనేది చాలా అవసరం. ఇంకా మీ బాయ్‌ఫ్రెండ్ మీ పట్ల ఎంత ప్రేమగా ఉన్నాడో తెలుసుకోవాలంటే.. మీ గురించి కొన్ని విషయాలు అతనికి బహిర్గతం చేయడం ద్వారా, సన్నిహితంగా మరియు దగ్గరగా ఉండవచ్చు.

ఇక మీ బాయ్‌ఫ్రెండ్‌తో సంబంధం చిరకాలం కొనసాగాలంటే తప్పకుండా ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి. అయితే, అతని గురించి వెంటనే తెలుసుకోవాలని అత్యుత్సాహం, ఆత్రుత అది మీ రిలేషన్‌షిప్ కు మరింత ప్రమాదకరంగా మారవచ్చు. దాంతో మీరు దోషిగా నిలబడవచ్చు. సో.. మెల్ల మెల్లగా మీ బాయ్‌ఫ్రెండ్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించండి.

ఒక్కోసారి మీ బాయ్ ఫ్రెండ్ మీకు సౌకర్యవంతంగా మాట్లాడటం మొదలు పెట్టినప్పుడు, అతని గురించి అడిగి తెలుసుకోవడం, లాజికల్‌గా అతని సమాధానాలను అనుసరించడం చేయాలి. అలాగే చిన్నచిన్న ప్రశ్నలతో ముందుకెళ్ళండి. ఈ మార్గంలో అయితేనే అతని గురించి మరింత బెటర్ గా తెలుసుకోగలుగుతారు.

మీ బాయ్ ఫ్రెండ్ ను గురించి తెలుసుకోవాలంటే, అతని ద్వారా అతని స్నేహితులను తెలుసుకోవడం, లేదా అతని ద్వారా అతని స్నేహితుల కలవడం ద్వారా, అతని గురించి మరింత బెటర్‌గా తెలుసుకోగలుగుతారు.

అతను ఏం పనిచేస్తున్నాడో మరియు అతని యొక్క అభిరుచిఏంటో తెలుసుకోవడం వల్ల మరిన్ని విషయాలు తెలుసుకోవచ్చు. అతని పనిగురించి మాట్లాడటంతో ప్రారంభించండి మరియు ఆరోజు పనిలో ఎలా ఉన్నది అడిగి తెలుసుకోండి. దాని వల్ల అతని యొక్క సహోద్యోగుల గురించి అడిగి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందని సైకాలజిస్టులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి