ఎవరు ఏ శివలింగాన్ని పూజించాలి? ఫలితం ఏంటి?

మంగళవారం, 1 మార్చి 2022 (21:59 IST)
లింగ పురాణం ప్రకారం బ్రహ్మవేత్తలు రసలింగాన్ని, శౌర్య ప్రధానులైన క్షత్రియులు బాణ లింగాన్ని, వాణిజ్య ప్రధానులైన వైశ్యులు స్వర్ణలింగాన్ని, ఇతరులు శిలా లింగాల్ని అర్చించాలి. స్ఫటిక లింగాన్ని మాత్రం ఎవరైనా అర్చించవచ్చు.


స్త్రీల విషయంలో భర్త జీవించిలేనివారు స్ఫటిక లింగాన్ని కానీ లేదా రసలింగాన్ని కానీ అర్చిస్తే  మంచిదని లింగపురాణంలో చెప్పబడింది. స్త్రీలలో అన్ని వయసుల వారూ స్ఫటిక లింగాన్ని అర్చించవచ్చు.

 
ఏ లింగపూజతో ఎలాంటి ఫలితం వస్తుందో చూద్దాం. రత్నజలింగాన్ని పూజిస్తే ఐశ్వర్యం, వైభవం సిద్ధిస్తాయి. శిలా లింగాన్ని పూజించడం వల్ల సర్వం సిద్ధించి పరిపూర్ణత కలుగుతుంది. ధాతుజ లింగపూజ కూడా ధన సంపత్తిని ఇస్తుంది.


దారుజ లింగం భోగ విలాసాలను ఇస్తుంది. లింగ పూజ కూడా శిలా లింగంలానే పరిపూర్ణతనిస్తుంది. కాల్చిన మట్టితో చేసిన లింగం శ్రేష్ఠమైనదని చెప్పబడింది. అన్నింటిలోకి ఉత్తమం శిలాలింగం, మధ్యమం లోహలింగం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు